గుంతకల్లు: ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోండి
గుంతకల్లు పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల్లో హాస్టల్ నిర్వహిస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.