ఫిట్‌గా ఉండాలనే కోరిక యూత్‌లో రోజురోజుకు పెరిగిపోతుంది. ఇందుకోసం తరచూ జిమ్‌లకు వెళ్లి కుస్తీ పడుతుంటారు. అయితే గంటల తరబడి వ్యాయామాలు చేయడం వల్ల పురుషుల సంతాన సాఫల్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, వంధ్యత్వం, జననేంద్రియాల్లో ఇన్‌ఫెక్షన్లకు కూడా దారితీస్తోందని యూకేకు చెందిన నిపుణులు తాజా అధ్యయనంలో వెల్లడించారు.