గుత్తిలో శుక్రవారం దసరా సందడి నెలకొంది. ఎక్కడ చూసినా జన కోలాహలం కనిపించింది. గుత్తిలోని అమృత్ సినిమా థియేటర్ కాలనీ, అంబేడ్కర్ కూరగాయల మార్కెట్, గుత్తి ఆర్ఎస్లోని పత్తికొండ రోడ్డు, మెయిన్ బజార్లలో సందడి నెలకొంది. దసరా సరకులు కొనుగోలు చేయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా వచ్చారు. దీంతో పూలు, పండ్లు, కిరాణా దుకాణాలు జనాలతో నిండిపోయాయి.