గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లికి చెందిన రమేష్ బాబుని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి (ఎం. వి. ఆర్. పి. ఎస్) అనంతపూర్ జిల్లా ఉపాధ్యక్షునిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ నియమించినట్లు రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. జిల్లాలో వాల్మీకుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు చెప్పారు.