గుత్తి పట్టణంలోని చెర్లోపల్లి కాలనీలో బుధవారం తెల్లవారుజామున కురిసిన ఓ మోస్తరు వర్షానికి రహమత్ బి అనే మహిళ ఇంటిపై కప్పు నేలకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. బాధితురాలు మాట్లాడుతూ. ఇంట్లో ఉన్న నిత్యవసర సరుకులతోపాటు ఎలక్ట్రికల్ వస్తువులు పాడయ్యాయన్నారు. తనను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.