గుంతకల్లు మున్సిపాలిటీలో సోమవారం ప్రాపర్టీ టాక్స్ వసూలు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ వసూలు చేస్తున్న ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ టాక్స్ ను సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విన్నవించారు.