ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం ఎక్స్ వేదికగా మాజీ సీఎం జగన్ చేసిన పోస్టుకు స్పందించారు. మొదటగా మనం పోరాటం చేయాల్సింది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపైనే అన్నారు. ఎందుకంటే ఏ ఎలక్ట్రానిక్ మిషన్లు నైనా ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. మన భారత దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే అది ఒక పేపర్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే సాధ్యమన్నారు.