తాడిమర్రి మండలంలోని రామాపురం, కునుకుంట్ల, చిల్ల కొండయ్య పల్లి, నార్పల మండలంలోని గూగూడు, ముచ్చుకుంటపల్లి గ్రామాలకు సాగునీరు ఇవ్వాలని ధర్మవరం టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ను కోరారు. సోమవారం ఆయా గ్రామాలకు చెందిన రైతులతో కలిసి కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు. పులివెందుల బ్రాంచ్ కెనాలు నీరు విడుదల చేయకపోవడంతో వారికి సాగునీరు అందలేదన్నారు.