అనంతపురం పట్టణంలోని నవోదయ కాలనీలో హత్యకు గురైన శ్రీధర్ కేసును 1వ పట్టణ పోలీసులు శుక్రవారం ఛేదించారు. హత్య కేసులో నిందితుడు తేజను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేంద్ర నాథ్ యాదవ్ తెలిపారు. నిందితుడి నుంచి పిడిబాకు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించిదని వివరించారు.