బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చి చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో అత్తా కోడలిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని చెప్పారు.