చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి శనివారం స్పందించారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్తా, కోడళ్లపై గ్యాంప్ రేప్నకు పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. పోలీసులు నిందితులను గుర్తించి, వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక వాడల్లో సరైన భద్రత చర్యలు లేకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు.