తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అంటే అది కేవలం గుర్తింపు మాత్రమే కాదని, అది ఒక కుటుంబానికే భరోసా లాంటిదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మంగళవారం అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జిలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.