ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం శనివారం నిధులు విడదల చేయనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ. 2 వేలు చొప్పున జమకానుంది. అనంతపురం జిల్లాలో 2, 79, 161 మందికి రూ. 55. 83 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి రూ. 6 వేలు అందిస్తోంది.