లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎంఈఓ

60பார்த்தது
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎంఈఓ
అనంతపురం జిల్లా కూడేరు ఎంఈఓపై ఏసీబీ దాడులు చేశారు. ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఎంఈఓ చంద్రశేఖర్ మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. గొట్టుకూరు వద్ద ఉన్న కార్పొరేట్ స్కూలు అనుమతుల కోసం ఎంఈఓ రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో పాఠశాల యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. అనంతపురంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కూడేరుకు తరలించారు.

தொடர்புடைய செய்தி