అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. బాధితులతో మాట్లాడుతూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.