అధికారుల స్పందించకపోయినా టిడిపి స్థానిక నాయకులు రోడ్డుపై ఉన్న గోతులు కప్పేందుకు స్పందించారు. ఆదివారం చోడవరం నియోజకవర్గం బుచ్చయ్య పేట గ్రామం నుంచి దిబిడ్డి వరకు గల రహదారిపై భారీగా గొంతులు ఉండడంతో.. వాహనదారుల ఇబ్బందులను గుర్తించిన టిడిపి, గొనబతుల శ్రీనివాస వద్ద నిత్య నరకంగా మారిన గోతిని నాయకులు పూడ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి మేము సైతం అంటూ విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు, స్థానికంగా వేసిన మెటీరియల్ను చదును చేసి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.