కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని సిఐటియు యలమంచిలి మండల కార్యదర్శి చింతకాయల శివాజీ ఆరోపించారు. గురువారం టౌన్ పరిధి కాలనీలలో ప్రచారం నిర్వహించి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ఈనెల 26న అనకాపల్లిలో సిఐటియు ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తామన్నారు.