వ్యాపారస్తులు వాణిజ వ్యాపారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ (ONDC)ను వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ సూచించారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ONDC కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వ్యాపారస్తులు స్వయం సహాయక సంఘాలు దీనిని ఉపయోగించుకుని లాభాలను అర్జించాలన్నారు. ఇది ప్రత్యక్షంగా మార్కెట్లలో ఉత్పత్తులను విస్తరించే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.