రాష్ట్రంలో నదులు, చెరువులను అక్రమణల నుంచి కాపాడాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య మంగళవారం విజ్ఞప్తి చేశారు. పెందుర్తిలో మాట్లాడుతూ అలాగే కాలుష్యం బారి నుంచి ప్రజలను రక్షించాలన్నారు. అప్పుడే మత్స్యకారుల జీవితాలు ఆనందమయంగా ఉంటాయన్నారు. ప్రజల ఆరోగ్యం కుదుటపడి వైద్య ఖర్చులు తగ్గుతాయన్నారు. కాలుష్యం నియంత్రణ మండలి మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు.