పెందుర్తి మండలం చింతల అగ్రహారం గ్రామానికి చెందిన రుత్తల రాముకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 1,19,119 మంజూరైంది. ఈ మేరకు రాముకు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు శనివారం చెక్కును పెందుర్తి మండలం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యానికి గురైన రాముకు చికిత్స కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని మంజూరు చేయాలని సీఎంకు ఎమ్మెల్యే ద్వారా రాము దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్యేకు రాము కృతజ్ఞతలు తెలిపారు.