పరవాడ ఎస్సై ఎం రామారావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు డీఐజీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల కిందట నాతవరం నుంచి రామారావు బదిలీపై పరవాడ వచ్చారు. నాతవరం ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ సివిల్ తగాదాలలో తలదూర్చిన కారణంగా రామారావు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సివిల్ తగాదాకు సంబంధించి ఓ మహిళ డీఐజీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ నిర్వహించి శనివారం సస్పెండ్ చేశారు.