నాతవరం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జిల్లా ట్రైబల్ స్పెషల్ ఆఫీసర్ నాగ శిరిషా, ఇన్ చార్జ్ ఎంపీడీవో కె. ఉషశ్రీ, తహశీల్దార్ వేణుగోపాల్ తో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక తరలింపు విషయంలో సాయంత్రం 6 వరకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ప్రతీ ట్రాక్టర్ పై ఉచిత ఇసుక బ్యానర్ ఉండేలా చూడాలని కోరారు.