నక్కపల్లి మండలంలో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తాహశీల్దార్ ఆర్ నరసింహమూర్తి తెలిపారు. బుధవారం నక్కపల్లి తాహశీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు నిర్వహించిన గ్రామసభల్లో భూ సమస్యలకు సంబంధించి 342 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులపై విచారణ నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.