వినాయకచవితి సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ప్రధాన మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. శుక్రవారం రాత్రి 10గంటలైనా ప్రజలు చవితి సామగ్రీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. పత్రి, పండ్లు, పువ్వులు, పాలవెల్లి, విద్యుత్ సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. పూజా సమాగ్రీ ధరలు విపరీతంగా పెంచి వ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు.