సిపిఎం దిగ్గజం సీతారం ఏచూరి పేరుమీద విశాఖలోని మద్దిలపాలెంలో ప్రజా ఉద్యమ కేంద్రానికి ( పార్టీ కార్యాలయం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సోమవారం శంకుస్థాపన చేశారు. విశాఖజిల్లాలో జరిగిన అనేకఉద్యమాల్లో సీతారాం ఏచూరి భాగస్వామ్యం ఎనలేనిదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆయన పేరుమీద మొదటిసారి కార్యాలయం ఇక్కడే నిర్మించడంఆనందంగా ఉందని ఆయన తెలిపారు. కార్యక్రమంలోసిపిఎంనేతల పాల్గొన్నారు.