పోర్టు హాస్పిటల్ ను సొంత నిధులతో అభివృద్ధి చేయాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి బి జగన్ డిమాండ్ చేశారు. పోర్ట్ హాస్పిటల్ ను ప్రైవేటుకు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 47వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆసుపత్రిని నడపడానికి అవసరమైన రిజర్వ్ ఫండ్స్ పోర్టు వద్ద సమృద్ధిగా ఉన్నాయన్నారు.