రాష్ట్రంలో నూతన మద్యం విధానంలోఇప్పటికే దుకాణాలు ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈనెల 9వ తేదీ సాయంత్రం తో ఈ గడువు ముగుస్తుందని మాడుగుల ఎక్సైజ్ సీఐ సిహెచ్ వీ ఎస్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. మాడుగుల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 13 మద్యం షాపులు మాడుగుల చీడికాడ, రావికమతం మండలాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందు నిమిత్తం మంగళవారం సాయంత్రం వరకు 78 దరఖాస్తులను స్వీకరించినట్టు సీఐ తెలిపారు.