ఈనెల 20న ద్వారకా నగర్ పౌరగ్రంథాలయంలో సాయంత్రం 2 గంటల నుంచి 7 గంటల వరకు గద్దరన్న యాదిలో కార్యక్రమం నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా విశాఖలోని తన స్వగృహంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గద్దర్ తన జీవితకాలం పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం సాహిత్యాన్ని రాస్తూ తన పాటల ద్వారా చైతన్యం తీసుకొచ్చారని అన్నారు.