ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు ఆదివారం విశాఖ నగరం బురుజుపేటలో వేంచేసియున్న కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన విప్ కు ఆలయ వేద పండితులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు.