అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణ్ లోవ పివిటిజి కొందు గిరిజనులు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ మేడం మేము చదువుకోవడానికి రేషన్ కార్డులో నమోదు చేయటం కోసం అల్లూరి జిల్లా మాదిరీగా మాకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించండి అంటూ వేడుకున్నారు. ఈ గ్రామంలో 13 విద్యార్థులు ఉన్నారు. వారంతా అప్పర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండాలన్నారు.