VIDEO: శైలజ థియేటర్‌లో మొదలైన 'గేమ్ ఛేంజర్' సంబరాలు

AP: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని శైలజ థియేటర్‌లొ రామ్ చరణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై హైప్‌ను పెంచేసింది.

தொடர்புடைய செய்தி