ప్రభుత్వ స్థలంలో మేరీ మాతా విగ్రహం.. ఉద్రిక్తత

గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహాన్ని తొలగించాలని స్థానికులను మున్సిపల్ అధికారులు ఆదేశించారు. అయినా వారు బొమ్మ తొలగించకపోవడంతో పోలీసుల సాయంతోనే మున్సిపల్ అధికారులు బొమ్మను తొలగించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

தொடர்புடைய செய்தி