నారాయణపేట: ఘనంగా సహస్రార్జున జయంతి వేడుకలు

నారాయణపేట పట్టణంలో ఎస్ ఎస్ కే సమాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సోమవంశీయ క్షత్రియ సహస్రార్జున జయంతి వేడుకలు సమాజం ప్రజలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబాభవాని ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సహస్రార్జున చిత్రపటానికి పూజలు చేశారు. సమాజం పెద్దలు పాట్కర్ (ఖత్రి) సమాజం గురించి ప్రజలకు వివరించారు. అందరూ ఐక్యంగా వుండాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி