అంజుమన్ ఇస్లామియా హైస్కూల్ ని యూనివర్సిటీ స్థాయికి ఎదిగేలా కృషి చేస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. శుక్రవారం అంజుమన్ హైస్కూల్లో ఉర్దూ, అరబ్బీలను సబ్జెక్టులుగా ప్రవేశ పెట్టిన నేపథ్యంలో నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ అంజుమన్ విద్యా సంస్థలను అభివృద్ధి పరచడమే తన ముఖ్య ధ్యేయమని ఆయన చెప్పారు.