స్వచ్చ గుంటూరు సాధనలో యువత పాత్ర కీలకమని గుంటూరు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు గుర్తు చేశారు. స్వచ్ఛత హి సేవాలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గుంటూరు నగరపాలక సంస్థ చేపట్టిన సైక్లింగ్, 2కె వాక్, స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను సోమవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో అందించారు. ఎన్ఎస్ఎస్ అధికారి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.