ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ ఓపెన్ అర్జీలపై జిల్లా అధికారులు శాఖల వారీగా సమీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదేశించారు. సోమవారం నరసరావుపేట స్థానిక కలెక్టరేట్ లోని బీఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రీ-ఓపెనింగ్ ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 48 రీ ఓపెన్ అర్జీలను వ్యక్తిగతంగా పరిశీలించారు.