AP: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ మేనియా పోవడం లేనట్లు తెలుస్తోంది. అమలాపురం మున్సిపల్ కాలనీలో ఇటీవల జన్మించిన శిశువుకు సచివాలయ సిబ్బంది జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. అయితే ఆ పత్రంపై మాజీ సీఎం జగన్ ఫోటో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారుల తీరు ఇంకా మారడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.