ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు సోమవారం చీరాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ అంశాలపై స్టేషన్ సీఐ పేరం నాగేశ్వరరావుతో సమీక్ష జరిపారు. కొత్త మద్యం విధానం అనంతరం సర్కిల్ పరిధిలోని పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. కొత్త దుకాణాలకు మద్యం సరిగ్గా అందుతున్నదీ లేనిదీ ఆయన ఆరా తీశారు. బెల్ట్ దుకాణాలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.