యూపీలోని ఔరైయాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై కొందరు వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు. భోలే మందిర్ సమీపంలో ఒక షాపు బయట ఇతరులు వస్తువులు ఉంచడంతో ఆ షాపు యజమాని అనిల్ కుమార్.. పక్కషాపులకు చెందిన వ్యాపారులను నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఒకరినొకరు కొట్టుకున్నారు. చొక్కాలు చించుకోవడంతోపాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.