TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంఖిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి పట్ల బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'శైలజకు కన్నీటి నివాళి. గిరిజన విద్యార్థినిల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి, వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మృతిచెందిన శైలజ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం' అని ట్వీట్ ద్వారా వెల్లడించారు.