ఊరేగింపులో జెండా ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతి (వీడియో)

592பார்த்தது
పూణె: పూణెలోని వాడ్‌గావ్ షెరీ ప్రాంతంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ యువకుడు మతపరమైన ఊరేగింపు సందర్భంగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు యువకులు డీజే ట్రక్కుపైకి ఎక్కి జెండాను ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు జెండా హైవోల్టేజీ విద్యుత్ తీగలకు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி