వరంగల్ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో కాసేపు ఆగారు. స్థానిక రహదారిపై వివేరా హోటల్ వద్ద పీసీసీ అధ్యక్షులు పి. మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రి శ్రీధర్ బాబుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారితో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భువనగిరి నియోజకవర్గ రాజకీయాలపై చర్చించారు.