ఆలేరు పట్టణంలోని ఎరువుల, విత్తనాల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారిణి అనురాధ, మండల వ్యవసాయ అధికారిణి దీప్తితో కలిసి తనిఖీ చేశారు. విత్తనాల, ఎరువుల స్టాక్ రిజిష్టర్లును, విత్తన ప్యాకెట్లపై వివరాలను పరిశీలించారు. విత్తనాల ఎరువుల దుకాణాలలో ప్రతీరోజు తప్పకుండా స్టాక్బోర్డులను రాయాలని సూచించారు. విత్తనాలను వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల దగ్గర నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు.