పర్యావరణ హితం కోసం ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. సాధారణంగా వివాహ వేడుకల్లో కార్ల డెకరేషన్ కోసం వివిధ ప్లాస్టిక్ పువ్వులు, బెలూన్లు, స్టిక్కర్లు వాడుతూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా ఓ వ్యక్తి తన కారును వివిధ మొక్కలతో అలంకరించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘ఇది మంచి ఆలోచన’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.