ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళలను 'బ్యాడ్ టచ్' నుండి రక్షించడానికి, పురుషుల చెడు ఉద్దేశాలను నిరోధించడానికి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. మహిళల దుస్తులను మెన్స్ టైలర్స్ కుట్టకూడదని పేర్కొంది. అమ్మాయిల శిరోజాలను కత్తిరించే పనులు కూడా చేయకూడదని ప్రతిపాదించింది. ఈ మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు హిమానీ అగర్వాల్ వెల్లడించారు. ఇటీవల జరిగిన సమావేశంలో కమిషన్ ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.