స్నానం చేసే సమయంలో వీపు తోమాలని భర్త గట్టిగా పిలిచాడని క్షణికావేశంలో ఓ భార్య రాయితో భర్త తల పగులకొట్టింది. హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడవ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన శివ తన భార్య రజిత ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడ నివాసం ఉంటున్నాడు. స్నానం చేసే సమయంలో వీపు తోమాలని శివ గట్టిగా అరిచాడు. దీంతో ఆవేశానికిలోనైన రజిత రాయితో భర్త తలపై కొట్టింది. భార్యపై పోలీసులకు శివ ఫిర్యాదు చేశాడు.