వాట్సాప్ సేవల్లో అంతరాయం కలుగుతోందని పలువురు యూజర్లు ట్విట్టర్ Xలో పోస్టులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం యూపీఐ సేవలు నిలిచిపోయాయి. సాయంత్రం వాట్సాప్ పని చేయడం లేదు. వాట్సాప్ సేవల్లో అంతరాయంపై 463 ఫిర్యాదులు నమోదయ్యాయి. 80% ఫిర్యాదులు మెసేజులు పంపడంలో, 15% యాప్‌లో, 4% లాగిన్ సమస్యలపై ఉన్నాయి. దీనిపై వాట్సాప్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరికొందరు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం కూడా పని చేయడం లేదని పోస్ట్ చేస్తున్నారు.