నీటిలో లవణాలు ఎక్కువైతే శరీరంపై ఎన్నో దుష్ప్రభావాలు చూపుతాయి. నీటిలో ఫ్లోరైడ్స్ ఒక మిల్లీగ్రామ్ మించితే డెంటల్ ఫ్లోరోసిస్, సోడియం ఎక్కువైతే బీపీ, ఆర్సెనిక్ ఎక్కువ ఉంటే చర్మంపై తెల్లని మచ్చలు, కాల్షియం తక్కువైతే ఎముకల సమస్యలు వస్తాయి. నైట్రేట్ వల్ల కిడ్నీ సమస్యలు, రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గి శ్వాస ఇబ్బందులు, కళ్లు తిరగడం, కనుపాపలు నీలం రంగులోకి మారడానికి కారణమవుతుంది. దీనినే 'బ్లూ బేబీ సిండ్రోమ్' అంటారు.