వేరుశనగ సాగులో కలుపు నివారణ, అంతరకృషి సక్రమంగా చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. వేరుశనగ విత్తిన 48 గంటల సమయంలోపు ఒక ఎకరాకు 200 లీటర్ల నీటికి 1 లీటరు పెండిమిథాలిన్‌ను కలిపి నేలపై పిచికారి చేయాలని పేర్కొంటున్నారు. కలుపు సమస్య తీవ్రంగా ఉన్న భూముల్లో ఇలా చేస్తే 25 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు.