తెలంగాణ రాజధాని హైదరాబాద్ లైఫ్సైన్స్కి హబ్‌గా మారిపోయిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లైఫ్ సైన్సెస్ సెక్టార్లో గత 10 నెలల్లో 140 ప్రాజెక్ట్స్ వచ్చాయని తెలిపారు. మొత్తంగా రూ.36 వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ను తీసుకొచ్చామని చెప్పారు. దీనివల్ల 51,000 మందికి ప్రత్యక్ష ఉపాధి, 1.5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. జీనోమి వ్యాలీ థర్డ్ ఫేజ్‌లో భాగంగా రాష్ట్రానికి భారీ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు.